బెండకాయ తింటే గుండె భేష్



బెండకాయలు తినడం చాలా మందికి నచ్చవు. కానీ అవి తినడం వల్ల గుండెకు రక్షణ లభిస్తుంది.



గుండె ఆరోగ్యాన్ని కాపాడాలనుకునేవారు కచ్చితంవగా ప్రతి రోజూ బెండకాయతో చేసిన వంటకాలను తినాలి.



బెండకాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇప్పటికే జంతువులపై చేసిన అధ్యయనంలో ఇది తేలింది.



బెండకాయలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి.



బెండకాయ తినడం వల్ల అధికరక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.



మధుమేహం ఉన్నవారు కూడా బెండకాయను తింటే మంచిది. ఇది గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.



బెండకాయలో పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి గుండెకు రక్షణ లభిస్తుంది.



బెండకాయ వారంలో కనీసం మూడు రోజుల పాటూ తినేందుకు ప్రయత్నించాలి.