పుట్టగొడుగులు తింటే మూడ్ మారిపోతుంది



పుట్టగొడుగులు తినే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ వాటిని తినడం వల్ల మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది.



మూడ్ బాగోనప్పుడు, డిప్రెషన్ గా ఉన్నప్పుడు పుట్టగొడుగులతో చేసిన ఆహారం తింటే మంచిది. ఉత్సాహం వస్తుంది.



మానసిక రోగాలు తగ్గడానికి పుట్టగొడుగులు ఎంతో సహకరిస్తాయని తాజా అధ్యయనం చెబుతోంది.



డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి రోగాలతో బాధపడుతున్నవారు పుట్టగొడుగులను అధికంగా తింటూ ఉండాలి.



పుట్టగొడుగుల్లో ఎర్గోథియోనీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.



పుట్టగొడుగుల్లో మానసిక ఆందోళనను తగ్గించే పొటాషియం ఉంటుంది. ఇది మనకి చాలా అవసరం.



కొందరికి పుట్టగొడుగులు పడకపోవచ్చు. అలాంటివారు మాత్రం పుట్టగొడుగులను దూరం పెట్టాలి.