చలికాలంలో మెంతి ఆకులు తింటే ఆరోగ్యం



చలితీవ్రత ఇంకా పెరుగుతోంది. చలి నుంచి శరీరాన్ని రక్షించే ఆహారాన్ని తినాలి.



మెంతి ఆకులు శరీరానికి వేడిని అందిస్తుంది. వారంలో కనీసం మూడు నాలుగు సార్లు వీటిని తినాలి.



మెంతి ఆకులు తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.



మెంతాకు రైస్, మెంతాకు పప్పు, మెంతాకు ఆలూ కర్రీ వంటివి తరచూ తింటూ ఉండాలి.



మెంతికూర తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.



జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటివి రాకుండా ఉండాలంటే మెంతి ఆకును డైట్లు చేర్చుకోవాలి.



మధుమేహులు మెంతాకు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.



హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు రాకుండా మెంతి కూర కాపాడుతుంది.