చలికాలంలో దూద్ జిలేబి తింటే ఎంతో ఆరోగ్యం

మనదేశంలోని చాలా ప్రాంతాల్లో ‘దూద్ జిలేబి’కి చాలా ప్రాచుర్యం ఉంది.

వేడి పాలల్లో జిలేబిని ముంచుకుని తింటే ఎంతో ఆరోగ్యమని, అది కూడా కచ్చితంగా చలికాలంలో తినాలని చెబుతారు.

కేవలం మనదేశంలోనే కాదు, పాకిస్తాన్ లో కూడా ఈ ఆహార కాంబినేషన్‌ మంచి ఫేమస్.

శీతాకాలంలో జిలేబి, పాల కలయిక మన శరీరంలోని ఒత్తిడిని కలిగించే హార్మోన్లపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.

వేడి పాలతో జిలేబీని తినడం వల్ల మైగ్రేన్ వంటి తలనొప్పులు కూడా తగ్గిపోతాయి.

బక్కపలచగా ఉన్న వారు ఈ ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఉబ్బసం నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఈ దూద్ జిలేబినీ బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటే బాగా శరీరంపై ప్రభావం చూపిస్తుంది.