చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదా, కదా అని సందేహంగా ఉందా? అయితే చూసేయండి. చికెన్ బ్రెస్ట్ లో లీన్ ప్రొటీన్ ఉంటుంది. ఇది కండరాల అభివృద్ధికి మంచిది. కణజాలాలను సరిచేయడానికి, కండరాలను నిర్మించడానికి కావాల్సిన అమైనో ఆమ్లాలు ఇందులో ఉంటాయి. చికెన్‌లో విటమిన్ బి, ఫాస్పరస్, సెలీనియంతో సహా అన్ని ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. చికెన్ లో మాంసకృతులు పుష్కలంగా ఉంటాయి. అల్పాహారం కోరికను తగ్గిస్తుంది. చికెన్ జీవక్రియను పెంచుతుంది. కెలరీలను సమర్థవంతంగా బర్న్ చేస్తుంది. చికెన్ సూప్, కూర, లేదా సలాడ్ గా ఏ విధంగానైనా తీసుకోవచ్చు. చికెన్ మన రోగనిరోధకశక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా, వైరల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. నోట్: మీకు ఏమైనా అనారోగ్యాలు ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ సలహా తీసుకుని తినాలి.