గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం అనుసరించడం ముఖ్యం.ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.


ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెల్లో మంటని తగ్గిస్తుంది.చేపలు, అవిసె గింజలు, సబ్జా గింజలు, చియా విత్తనాలు, వాల్ నట్స్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ వినియోగాన్ని పరిమితం చేస్తే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఇవి రెడ్ మీట్, వెన్న, చీజ్, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో కనిపిస్తాయి.
రక్తప్రవాహంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతాయి.


బజ్రా, రాగి, జోవర్ వంటి తృణధాన్యాలు చనా, మూంగ్, రాజ్మా వంటి పప్పులు ఎంచుకుంటే ఉత్తమం.గుండె పదిలంగా ఉండాలంటే అదుపులో ఉంచుకోవాల్సిన మరొకటి సోడియం.
ఉప్పు తగ్గించుకోవాలి. భోజనంలో టేబుల్ సాల్ట్, ఊరగాయల వాడకాన్ని పరిమితం చేయాలి.


అధిక చక్కెర వినియోగం బరువు పెరగడానికి, ట్రైగ్లిజరైడ్ స్థాయిలని పెంచుతుంది.Images Credit: PexelsThanks for Reading. UP NEXT

రోజూ తులసి టీ తాగితే ఇన్ని లాభాలా?

View next story