గుండె కోసం బెండకాయ తినడం



గుండెకు మేలు చేసే ఆహారం తినాల్సిన అవసరం ఉంది. వారానికి కనీసం రెండు సార్లు బెండకాయ తింటే మంచిది.



బెండకాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.



మధుమేహం ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన కూరగాయల్లో బెండకాయ ఒకటి.



ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది.



దీనిలో పీచు అదికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.



పీచు అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల గుండెకు కూడా మేలు జరుగుతుంది.



బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి.



పిల్లలకూ బెండకాయ పెట్టడం వల్ల అజీర్తి వంటివి రావు.