గర్భిణీ స్త్రీలు గ్యాస్ సమస్య అసౌకర్యానికి గురిచేస్తుంది. అయితే కొన్ని చిట్కాలతో దానిని దూరం చేసుకోవచ్చు. వేయించిన ఫుడ్‌కి దూరంగా ఉంటూ.. ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోండి. ఆహారం తీసుకునే సమయంలో గాబరాగా కాకుండా.. పూర్తిగా నమలండి. గర్భవతి అయినా.. కాకున్నా.. నీరు పుష్కలంగా తాగితే ఆరోగ్యానికి మంచిది. వైద్యుని సూచనలమేరకు చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. ప్రోబయోటిక్స్ రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆహారం తీసుకున్న వెంటనే పడుకోవడం, నిద్రపోవడం చేయకండి. మీ జీర్ణక్రియపై ఒత్తిడి ప్రభావం ఉంటుంది కాబట్టి.. రిలాక్స్‌గా ఉండండి. (Image Source : Pixabay)