కిడ్నీలో రాళ్లు చాలా బాధాకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగిస్తాయి. అయితే ఇవి ఏర్పడడం, చికిత్సపై చాలా అపోహాలు ఉంటాయి. ఇంతకీ వాటిలో నిజమెంత? అపోహ : పాలు మానేస్తే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. వాస్తవం : కాల్షియం తగ్గిస్తే బోన్ డీమినరైజేషన్, ఆక్సలేట్ వంటి ప్రతికూల పరిణామాలు ఏర్పడుతాయి. ఇవి కిడ్నీలలో రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. కానీ పాల ఉత్పత్తులను మితంగా తీసుకుంటే మంచిది. అపోహ : కిడ్నీలో రాళ్లు వెన్నునొప్పిని కలిగిస్తాయి. వాస్తవం : ఇవి నొప్పిని కలిగించవు. కానీ ఈ రాళ్లు మూత్రనాళంలో అడ్డుపడినప్పుడు కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అపోహా : బార్లీ, క్రాన్బెర్రీ జ్యూస్ మూత్రపిండాళ్లో రాళ్లను కరిగిస్తాయి. వాస్తవం : ఇవి మూత్రనాళాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి కానీ రాళ్లపై ప్రభావం చూపవు. అపోహా : టమోటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయట.. వాస్తవం : మీ రక్తంలో పొటాషియం స్థాయిలు ఎక్కువ ఉంటే టమోటాలు తగ్గిస్తేనే మంచిది.