మగాళ్లకూ బ్రెస్ట్ క్యాన్సర్ - ముందుగా కనిపించే లక్షణాలివే

బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకే కాదు.. పురుషులకూ వస్తుంది. ఎక్కువగా 60-70 ఏళ్ల పురుషుల్లో ఇది కనిపిస్తుంది.

అయితే, ఈ క్యాన్సర్‌ ఏ వయస్సులో ఉన్నవారికైనా వస్తుంది. అందుకే, ఈ లక్షణాలు తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి.

ఛాతీ పరిమాణంలో మార్పులు కనిపిస్తున్నట్లయితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

చంక, ఛాతి ప్రాంతాల్లో నొప్పి లేని గడ్డలు ఏర్పడుతున్నా అనుమానించాల్సిందే.

ఛాతికి ఉండే చనుమొనలు లోపలికి కుచించుకు పోవడం కూడా ఒక సంకేతం.

శరీరంపై దద్దుర్లు, చనుమొన నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.



క్యాన్సర్ ఏర్పడిన చోట చర్మం పుండులా మారుతుంది.

పై లక్షణాలు ఏవి కనిపించినా డాక్టర్‌ను సంప్రదించడం మరిచిపోవద్దు. బీ కేర్ ఫుల్.



Images Credit: Pexels