బట్టతల రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఫ్యామిలీలో ఎవరికైనా బట్టతల ఉంటే.. అది తర్వాతి తరాలకు కూడా వస్తుంది.

అలాగే, మనం తినే ఆహారం, వాతావరణం కూడా బట్టతలకు కారణమవుతాయి.

శరీరంలోని హార్మోన్ల మార్పులు కూడా బట్టతలకు కారణం కావచ్చు.

చిత్రం ఏమిటంటే మీ చేతి వేలు.. భవిష్యత్తులో మీకు బట్టతల వస్తుందో లేదో చెప్పేస్తుందట.

మీ కుడిచేతి ఉంగరం వేలు.. చూపుడు వేలుకంటే పెద్దగా ఉందా? అయితే, బట్టతల రావచ్చు.

ఆండ్రోజెనెటిక్ అలోపేసియా(బట్టతల) బాధితులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.

ఈ స్టడీలో భాగంగా 37 ఏళ్లు పైబడిన 240 మంది పురుషులు వేళ్లు పరిశీలించగా ఈ విషయం తేలింది.

గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఉంగరం వేలు పెద్దగా ఉండేవారిలో టెస్టోస్టెరాన్స్ (లైంగిక సామర్థ్యం) ఎక్కువట.

Images Credit: Pexels and Pixabay