చెవులకు ఇయర్ ఫోన్స్ మంచిదా? హెడ్ ఫోన్స్ మంచిదా?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ తప్పనిసరిగా వాడుతున్నారు.

నిజానికి ఇయర్‌ ఫోన్స్, హెడ్ ఫోన్స్ ఎక్కువ సేపు వాడితే వినికిడి సమస్య వస్తుంది.

అయితే, ఇయర్ ఫోన్స్ తో పోల్చితే హెడ్ ఫోన్స్ కాస్త బెటర్ అంటున్నారు నిపుణులు.

హెడ్‌ ఫోన్స్ చెవి లోపలికి వెళ్లవు. బయటి నుంచి చెవిని కప్పివేస్తాయి.

ఇయర్‌ ఫోన్స్ చెవి లోపలకి వెళ్తాయి. చాలా చెవి సమస్యలను తెచ్చిపెడతాయి.

హెడ్‌ ఫోన్స్ తో పోల్చితే ఇయర్‌ ఫోన్స్ వల్ల చెవి ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.

ఎక్కువ సౌండ్ పెట్టుకుని వినడం వల్ల వినికిడి కణాలు సున్నితత్వాన్ని కోల్పోతాయి.

ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ ఎక్కువ సేపు పెట్టుకుంటే మెదడుపై ప్రభావం పడుతుంది.

All Photos Credit: pexels/pixabay.com