మజ్జిగ అతిగా తాగితే సైడ్ ఎఫెక్టులు తప్పవు



మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో రోగాలకు ఇది నివారణగా పనిచేస్తుందని చెబుతారు.



మజ్జిగ కూడా అతిగా తాగితే కొన్ని రకాల సమస్యలు వస్తాయి. వీటిపై చాలా తక్కువ మందికి అవగాహన ఉంది.



అధికంగా మజ్జిగ, పాల పదార్థాలు తినడం వల్ల కడుపునొప్పి, అజీర్తి, విరేచనాలు కలుగుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది.



కాబట్టి మజ్జిగను అధికంగా తాగవద్దు. ఎవరిలో ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ సమస్య ఉంటుందో కనిపెట్టడం కష్టం.



మజ్జిగ అధికంగా తాగడం వల్ల కొందరికి చర్మంపై దద్దుర్లు రావచ్చు. కాబట్టి రోజుకు ఒక గ్లాసుకి మించి తాగకపోవడం మంచిది.



క్యాలరీలు లేవు కదా అని మజ్జిగను అధికంగా తాగితే మాత్రం జలుబు వంటి సమస్యలు వస్తాయి.



కొంతమంది మజ్జిగలో చక్కెర వేసుకొని తాగుతూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప ఎలాంటి లాభము ఉండదు.



చక్కెర లేకుండా సాధారణ మజ్జిగను తాగడమే ఆరోగ్యకరం. అలాగే ఉప్పును కూడా అధికంగా వేసుకోకూడదు.