అధిక ఒత్తిడితో క్యాన్సర్ ప్రమాదం



క్యాన్సర్ పేరు చెబితేనే వణికిపోయేవారు ఎంతోమంది. ఆ రోగం బారిన పడిన వారు సాధారణ జీవితం గడపడం కష్టం.



ఒత్తిడి కారణంగా కూడా క్యాన్సర్ బారిన పడే వాళ్ళు ఉన్నారు. ఒత్తిడికి, క్యాన్సర్‌కు సంబంధం ఉన్నట్టు ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.



ఒత్తిడి హార్మోన్లు అధికంగా విడుదల అవ్వడం వల్ల అధిక బరువు, ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటి వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు.



ఊబకాయం బారిన పడిన వారిలో రొమ్ము క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటివి అధికంగా వస్తాయి.



మానసిక ఒత్తిడితో బాధపడేవారు క్యాన్సర్ బారిన కూడా పడితే వారు త్వరగా కోలుకోవడం అసాధ్యం.



ఒత్తిడి లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్న వారు ఎక్కువ కాలం జీవిస్తారని ఇప్పటికే అధ్యయనాలు చెప్పాయి.



కాబట్టి మానసిక ప్రశాంతతతో ఉండడానికి ప్రయత్నించండి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.



ధూమపానం, మద్యపానం వంటివి మానేయండి. అధిక కొవ్వు కలిగిన పదార్థాలను తినడం మానేయండి.