టీ ఇలా తాగితే కష్టమే



కొంతమంది ఒకేసారి టీని ఎక్కువ తయారుచేసుకుని స్టోర్ చేసుకుంటారు. తాగే ముందు మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తాగుతూ ఉంటారు.



టీని పదే పదే వేడి చేసుకుని తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.



టీని చేశాక నాలుగు గంటల్లోపు తాగేయాలి. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేసుకొని తాగడం వల్ల ఉపయోగం ఉండదు.



నాలుగ్గంటల దాటాకా టీలో బ్యాక్టీరియా చేరడం మొదలైపోతుంది.



హెర్బల్ టీ వంటివి చేసిన వెంటనే తాగేయాలి. వాటిని దాచుకొని మళ్ళీ వేడి చేసి తాగడం వంటివి చేయకూడదు.



గ్రీన్ టీ వంటివి మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం వల్ల అందులో టానిన్లు ఏర్పడే అవకాశం ఉంది. ఆ టానిన్లు మన శరీరంలో చేరితే చాలా డేంజర్.



బ్యాక్టీరియా, ఫంగస్ చేరిన టీ ని వేడి చేసుకుని తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.



టీని రోజులో రెండు సార్లు మాత్రమే తాగాలి. అధికంగా తాగితే ఇతర సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంది.