రోజూ కూల్‌డ్రింకు తాగితే ఎంత ప్రమాదమంటే..



కూల్ డ్రింక్‌కు అభిమానులు ఎక్కువ. దానిలో వాడే చక్కెర... ఆ వాసన, రుచికి మనల్ని బానిసను చేసుకుంటుంది.



కూల్ డ్రింకు రోజూ తాగితే, రోజూ మద్యం తాగినంత ప్రభావం శరీరంపై పడుతుంది.



ముఖ్యంగా ఆడవాళ్లు కూల్ డ్రింకులు పూర్తిగా దూరం పెట్టాలి. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు కూల్ డ్రింక్ తాగకూడదు.



రుతుక్రమం ఆగిపోయాక మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి శీతల పానీయాలు తాగడం వల్ల అవి వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది.



కూల్ డ్రింక్ ను ప్రతిరోజూ తాగడం లేదా తరచూ తాగడం చేయకూడదు. నెలలో మూడు సార్ల కంటే తక్కువగా తీసుకోవాలి.



కూల్ డ్రింకులు తాగడం వల్ల కూడా కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది.



కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులు కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది.



గర్భిణీలు కూల్ డ్రింకులు పూర్తిగా తాగకూడదు. పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా కార్బోనేటెడ్ డ్రింకులకు దూరంగా ఉండడం చాలా అవసరం.