డయాబెటిస్ ఉంటే ఈ పానీయం తాగండి



టీ, కాఫీలు మితంగా తాగితే ఆరోగ్యకరమే కానీ ఇందులో ఉండే కెఫిన్ మాత్రం ఒక్కోసారి ఆరోగ్యానికి హాని చేస్తుంది.



మధుమేహంతో బాధపడుతున్న వారు కెఫీన్ ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు.



ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం దాల్చిన చెక్కతో చేసిన పానీయం ప్రతిరోజూ తాగితే రక్తంలో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.



దాల్చిన చెక్క మంచి సువాసన వేస్తుంది. చిన్న ముక్కను టీలో వేసుకున్న చాలు మసాలా టీ అదిరిపోతుంది.



ఉదయాన్నే ఖాళీ పొట్టతో దాల్చిన చెక్క పానీయాన్ని తీసుకుంటే మధుమేహ రోగులు ఆరోగ్యంగా జీవిస్తారు.



గుండెకు కూడా ఈ దాల్చిన చెక్క పానీయం ఎంతో సహాయపడుతుంది.



దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.



దాల్చిన చెక్క మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. పిల్లలకు ఈ పానీయాన్ని తాగించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.