కఫం విరగాలంటే ఈ లవంగ టీ తాగండి

కఫం వదలాలంటే ఆయుర్వేదం చెబుతున్న చిట్కా లవంగ టీ.

లవంగ టీ రోజుకు రెండు సార్లు తాగితే చాలు కఫం విరిగి బయటికి వచ్చేస్తుంది.

అయిదు లవంగాలు, చిన్న అల్లం ముక్క, చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకుని రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి.

బాగా మరిగాక వడకట్టేయాలి. ఆ నీటిలో అరచెంచా తేనె కలుపుకుని తాగాలి.

ఈ టీ గొంతులోకి జారుతుంటే ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది.

ఈ టీలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి.

సైనస్ సమస్యతో బాధపడేవారు కూడా ఈ మిశ్రమాన్ని తాగితే ఎంతో మంచిది.

ఈ టీని తరచూ తాగడం అలవాటు చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, జ్వరం, దగ్గు వంటివి త్వరగా దాడి చేయవు.