ప్రతిరోజూ టీ తాగడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే
ప్రమాదాన్ని సగానికి తగ్గించుకోవచ్చని సరికొత్త అధ్యయనం చెబుతోంది.


అయితే మీరు తాగాల్సింది ఇంత పంచదార, పాలు పోసుకుని టేస్టీగా ఉండే మిల్క్ టీ మాత్రం కాదండోయ్.



రోజు కనీసం ఒక కప్పు డార్క్ టీని తాగే వాళ్ళలో మధుమేహం వచ్చే
అవకాశం 47 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.


ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, గట్ బూస్టింగ్ ఎఫెక్ట్ కారణంగా
రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగ్గా ఉండటంలో సహాయపడుతుంది.


బిల్డర్స్ బ్రూ లేదా గ్రీన్ టీ తో సహా ఏదైనా టీ తాగడం వల్ల మధుమేహం ప్రమాదాన్ని 28 శాతం తగ్గించుకున్నట్టే.



డార్క్ టీ తాగేవారిలో మధుమేహం రాకుండా ఎక్కువ ప్రయోజనాలు పొందినట్టుగా తేలింది.



టీ తాగడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు
తక్కువగా ఉన్నాయని ఇప్పటికే వచ్చిన పలు పరిశోధనల్లో తేలింది.


రోజుకు నాలుగు కప్పుల టీని తీసుకోవడం వల్ల టైప్2 డయాబెటిస్
వచ్చే ప్రమాదం 17% తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.


పదేళ్లపాటు రోజుకు నాలుగు కప్పుల గ్రీన్ టీ ని తాగిన వారిలో
డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గినట్టు గుర్తించారు.


Images Credit: Pexels