కాలేయ సమస్యలు, లివర్ క్యాన్సర్ సంకేతాలు అంత త్వరగా బయటపడవు. దశల వారీగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి వాటిని విస్మరించకూడదు. పొత్తికడుపులో కుడివైపు ఎగువ భాగంలో నొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లండి. పొత్తి కడుపులో ఉబ్బరం లేదా వాపుగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. కామెర్లు వచ్చి చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారితే వైద్యుడిని సంప్రదించాలి. ఆకలి తగ్గిపోయి.. ఒకేసారి బరువు తగ్గిపోవడం కూడా అంత మంచి విషయం కాదు. పని చేసి అలపోవడం వేరు.. ఏమి పని చేయకపోయినా అలసిపోతుంటే జాగ్రత్త. వికారం, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు లివర్ క్యాన్సర్లో భాగమే. (Image Source : Pinterest)