చాలా మందికి ఇళ్ళలో కుక్క పిల్లలని పెంచుకోవడం అంటే ఇష్టం.



పెట్ డాగ్స్ ఆరోగ్యం కోసం అన్ని పనులు చేస్తారు. అయితే వాటికి పెట్టకూడదని కొన్ని ఆహారాలు ఉన్నాయి.



అవి పెట్టడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది.



అందుకే ఈ ఆహారాలు పొరపాటున కూడా వాటికి ఎప్పుడు పెట్టకూడదు.



ఉల్లిపాయ, వెల్లుల్లి కొద్ది మొత్తంలో డాగ్స్ కి పెట్టినా కూడా అది చాలా ప్రమాదకరంగా మారుతుంది.



అవకాడో తింటే వాటికి డయేరియా, వాంతులు అయ్యే అవకాశం ఉంది.



థియోబ్రోమిన్ ఉండటం వల్ల కుక్కలకి చాక్లెట్లు అసలు మంచిది కాదు.



వండని లేదా పచ్చి గుడ్లు మాత్రం కుక్కలకు పెట్టకూడదు. ఇవి వాటికి ఫుడ్ పాయిజన్ తో సమానం.



గమ్, టూత్ పేస్ట్ లేదా ఎటువంటి క్యాండిస్ లో అయినా xylitol అనే సమ్మేళనం ఉంటుంది.
కుక్కల మూత్రపిండల వైఫల్యానికి దారి తీస్తుంది.


కాఫీ గింజలు, టీ ఆకులు, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది కుక్కలకు ప్రాణాపాయం



ఉప్పు తింటే వాటికి అతిగా దాహం వేస్తుంది. అధిక మూత్రవిసర్జనకు కారణమవుతుంది.



అరటి, యాపిల్, పుచ్చకాయ వంటి కొన్ని పండ్లలో విత్తనాలు ఉంటాయి. వాటిని పెట్టడం మంచిది కాదు.



ద్రాక్ష, ఎండు ద్రాక్ష కుక్కలలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి.
Images Credit: Pexels