చిలకొట్టిన జామ పండ్లను నీట్‌గా కడిగేసి తినేస్తే సరి అనుకుంటున్నారా? ఆ పండ్లను కేవలం చీలకలే కొరికాయని అనుకుంటే పొరపాటే, గబ్బిలాలు కూడా కొరకవచ్చు. ఔనండి, కొరికినట్లు ఉండే జామ పండ్లను తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు. కేరళలోని ఎర్నాకులంకు చెందిన ఓ వ్యక్తి జామ పండు తిని నిఫా వైరస్‌కు గురయ్యాడు. తాజాగా ఎలాంటి దెబ్బలు లేని జామ పండ్లను మాత్రమే తినండి. విచారణలో.. అతడు గబ్బిలం కొరికిన జామ పండ్లను తిన్నాడని తేలింది. కాబట్టి ఇకపై కొరికినట్లు లేదా దెబ్బతిన్న జామ పండ్లను అస్సలు కొనొద్దు. తినొద్దు. Images Credit: Pexels