టోపీ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా?



నిత్యం టోపీ పెట్టుకునే వారికి జుట్టు రాలిపోయే సమస్య వస్తుందని ఎంతోమంది నమ్ముతున్నారు.



ఈ టోపీ పెట్టుకోవడం వల్ల మాడు వేడెక్కుతుందని, ఇది జుట్టు రాలడానికి దారితీస్తుందని అనుకుంటారు.



టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోదని వైద్యశాస్త్రం దృఢంగా చెబుతోంది.



జుట్టు ఊడిపోవడానికి, బట్టతల రావడానికి ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు, హార్మోన్లలో మార్పులు ఉంటాయి.



టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుంది అనుకోవడం కేవలం ఒక అపోహ.



జుట్టు హఠాత్తుగా రాలిపోవడానికి, బట్టతల రావడానికి కుటుంబ వారసత్వం కారణంగా భావించవచ్చు.



హార్మోన్లలో విపరీతమైన మార్పులు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతాయి. కొన్ని రకాల ఆహారపు అలవాట్లు జుట్టు రాలడాన్ని ప్రేరేపిస్తాయి.



ధూమపానం, మద్యపానం వంటివి జుట్టును బలహీనపడేలా చేస్తాయి.