ప్రొటీన్ పొడితో మొటిమలు వస్తాయా?



ప్రోటీన్ పౌడర్‌ను పాల ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. దీన్ని మితంగా తీసుకుంటే ఆరోగ్యకరమే.



ప్రతిరోజూ అధికంగా తీసుకుంటే మాత్రం కొన్ని రకాల సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం పెరుగుతుంది.



ప్రోటీన్ పౌడర్‌ను తీసుకునే వారిలో టీనేజర్లు, యువతే అధికంగా ఉంటారు. ఆ వయసులో మొటిమలు వచ్చే అవకాశం అధికంగానే ఉంటుంది.



ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల మొటిమలు వచ్చే ఛాన్సులు మరింత పెరుగుతాయి.



ఇలాంటి పొడులలో హార్మోన్లు, బయో యాక్టివ్ పెప్టైడ్లు ఉంటాయి. ఇవి చర్మంలో సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది.



ప్రతి రోజూ ప్రోటీన్ పౌడర్‌ను తీసుకోవడం వల్ల దాని పరిమాణం శరీరంలో పెరిగిపోతుంది. ఇది పోషకాల అసమతుల్యతకు కారణం అవుతుంది.



ప్రోటీన్ల కోసం పాలు, మాంసం, గుడ్లు వంటి వాటిపైన ఆధారపడితే మంచిది.



ప్రోటీన్ పౌడర్‌ను తక్కువ మొత్తంలోనే తాగితే ఉత్తమం. లేకుంటే శరీరంలో పోషకాల అసమతుల్యత ఏర్పడి మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.