గ్రీన్ టీతో డయాబెటిస్ తగ్గుతుందా?



ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గ్రీన్ టీను తాగుతూ ఉంటారు. దీన్ని తాగడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతారు పోషకాహార నిపుణులు.



గ్రీన్ టీ పరగడుపున తాగడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా, తాజాగా ఉంటారని అంటారు.



ఇది టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.



గ్రీన్ టీ లో మొక్కల ఆధారిత సమ్మేళనాలైనా పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి.



గ్రీన్ టీ తాగడం వల్ల డిహైడ్రేషన్ సమస్య కూడా రాదు. శరీరంలో ఇన్ల్ఫమేషన్‌ను ఇది తగ్గిస్తుంది.



శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగించడానికి, బరువు తగ్గించడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.



గ్రీన్ టీలో ఉండే కాటేచిన్స్ అనేవి చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. ఇవి గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి.



రోజూ పరగడుపునే గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకోవాలి. అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది.