రోజుకో గుడ్డుతో పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందా?

ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

18 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు గల 79 మందిపై ఒక అధ్యయనాన్ని నిర్వహించారు.

ఆ అధ్యయనంలో గుడ్లు తినడం వల్ల జ్ఞాపకశక్తిని పెరుగుతుందని తేలింది.

గుడ్డులోని ప్రొటీన్ జ్ఞాపకశక్తిని పెంచుతుందని పరిశోధకులు నిర్ధారించారు.

స్వీయ నియంత్రణ, సృజనాత్మకత, శ్రద్ధ, తార్కికంగా ఆలోచించడం, జ్ఞాపకశక్తి, పనులను మెరుగ్గా చేసేలా చేయడం వంటివి గుడ్డు తినడం వల్ల కలిగే అధిక ప్రయోజనాలు.

అందుకే పిల్లలకు రోజుకో గుడ్డు తినిపిస్తే చాలా మంచిది.

రోజుకో గుడ్డు వరకు మంచిదే, కానీ అధికంగా తినడం వల్ల మాత్రం సమస్యలు రావచ్చు.

గుడ్డు పచ్చ భాగంలో ఉండే కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో తీసుకోవడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరగవచ్చు.