ఉడికించిన గుడ్డును ఎంత సేపట్లో తింటే మంచిదో తెలుసా? ఉడికించిన గుడ్డును ఎంతసేపట్లో తినాలి అనే విషయంలో చాల మందిలో స్పష్టతలేదు. ఉదయం ఉడికించిన గుడ్డును సాయంత్రం కూడా తింటారు. ఉడికించిన గుడ్డును ఎక్కువ సేపు ఉంచి తినడం మంచిది కాదట. అలాచేస్తే గుడ్డు మీద వైరస్, బ్యాక్టీరియాలు చేరి అనారోగ్యానికి కారణం అవుతాయి. గుడ్డును ఉడికించిన తర్వాత ఒకపూట వరకు బయట ఉంచవచ్చు. ఉడికించిన గుడ్డును ఫ్రిజ్ లో పొట్టు తీయకుండా వారం రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. పొట్టు తీసి గుడ్లను ఫ్రిజ్ లో 3 నుంచి 4 రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ రోజులు నిల్వ చేస్తే మంచిది కాదంటున్నారు నిపుణులు. Photos Credit: Pixabay.com