అరటిపండు తొక్కతో ఇన్ని లాభాలున్నాయా?

అరటిపండు తినేటప్పుడు తొక్కను పడేస్తుంటాం.

కానీ, ఆ తొక్కతో బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

అరటి తొక్కలోని ప్రీబయోటిక్స్ పేగులో మంచి బాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అరటి తొక్కలోని ఫైబర్‌ మలబద్ధకాన్ని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది.

అరటి తొక్కలో పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

వీటి వల్ల క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ దరి చేరవు.

అరటి తొక్కల గుజ్జుతో బ్రష్ చేస్తే దంతాలను తెల్లగా మారుతాయి.

అరటి తొక్కలోని విటమిన్ E కళ్ల కింద వాపు, నల్ల మచ్చలను తగ్గిస్తాయి.

అరటి తొక్క గుజ్జును ముఖానికి రాస్తే మొటిమలు, ఎలర్జీ మాయం అవుతాయి. All Photos Credit: pexels.com