శరీరానికి ఫుడ్​ వల్లనే 80 శాతం శక్తి అందుతుంది.

అయితే భోజనం చేసే సమయంలో కొందరు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.

వేగంగా తినేసి అయ్యిందని అనిపిస్తారు. ఇలా భోజనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండే వారి ఆరోగ్యం మీద నెగిటివ్ ప్రభావం ఉంటుందట.

భోజనం చేసే సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వేగంగా భోజనం చేయడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.

వేగంగా తింటే బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే ఆహారాన్ని బాగా నమిలి తినాలి అంటున్నారు. ఇలా చేయడం వల్ల బరువు కంట్రోల్​లో ఉంటుంది.

వేగంగా భోజనం చేస్తే ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ క్రీయాశీలంగా ఉండదు.

ఇది టైప్ 2 డయాబెటిస్​కు కారణం అవుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels