తలకు నూనె పెట్టాల్సిందేనా?



నూనె రాస్తే ముఖం జిడ్డుగా అవుతుందని ఎంతోమంది తలకు నూనెను పెట్టరు.



జుట్టు ఆరోగ్యంగా ఎదగాలంటే నూనెను తప్పక రాయాలి.



ప్రతిరోజూ రాయడం వీలు కాకపోతే వారానికి కనీసం రెండుసార్లు తలకు నూనెను పట్టించి, ఆ మరుసటి రోజు తలస్నానం చేస్తే మంచిది.



ఆయుర్వేదంలో కూడా తలకు నూనె పట్టించడం చాలా అవసరం అని చెబుతున్నారు.



జుట్టు రాలిపోకుండా, చుండ్రు పట్టకుండా ,కుదుళ్ళు బలహీనంగా మారకుండా కాపాడడంలో నూనె ముందుంటుంది.



నూనె తలకు పట్టించి మర్దనా చేయడం ముఖ్యం. దీనివల్ల అక్కడున్న రక్తనాళాలు చురుగ్గా మారుతాయి.



కొబ్బరి నూనె కాస్త వేడి చేసి తలపై మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మరింతగా మెరుగుపడుతుంది.



కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, నువ్వుల నూనె, బాదం నూనె, బృంగరాజ్, ఉసిరి నూనె వంటివన్నీ కూడా జుట్టును కాపాడుతాయి.