బొప్పాయితో కలిపి వీటిని తినవద్దు



బొప్పాయిలో ఉండే లైకోపీన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యానికి కూడా బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది.



విటమిన్ కే లోపంతో బాధపడే వ్యక్తులు బొప్పాయిని తినడం వల్ల ఆ పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చు. వారి ఎముకలను బలోపాతం చేసుకోవచ్చు.



బొప్పాయి తినడానికి గంట ముందు లేదా గంట తర్వాతే ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తినకూడదు.



అలాగే బొప్పాయి తినడానికి ముందు కూడా పాల ఉత్పత్తులను తినకూడదు. తింటే మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



బొప్పాయి పండు తిన్నాక కోడిగుడ్లతో వండిన ఆహారాలను కూడా దూరంగా ఉంచాలి.



ఇతర పండ్లతో బొప్పాయిని కలిపి ఫ్రూట్ సలాడ్ గా తయారు చేయకూడదు.



బొప్పాయి తిన్నాక చల్లటి నీరు తాగవద్దు. ఇవి జీర్ణ సమస్యలను పెంచేస్తాయి.



నారింజ పండ్లు ,బొప్పాయిలు కలిపి తినడానికి ప్రయత్నించవద్దు. ఈ రెండు కూడా వ్యతిరేక లక్షణాలు కలిగి ఉన్న పండ్లు.