అక్కడ హిట్లు ఇచ్చి, ఇక్కడ ఫ్లాప్‌లు - మెహర్ రమేష్ ఇలా కూడా చేస్తాడా?

మెహర్ రమేష్ పేరు వింటేనే తెలుగు హీరోలు, నిర్మాతలు భయపడుతున్నారు.

తెలుగులో ఆయన తెరకెక్కించిన ఏ చిత్రం హిట్ అందుకోలేదు.

కన్నడలో ఆయన తీసిన చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

2008లో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘కంత్రీ’ యావరేజ్ గా నిలిచింది.

2009లో ప్రభాస్ తో తెరకెక్కించిన ‘బిల్లా’ ఫర్వాలేదు అనిపించింది.

2011లో ఎన్టీఆర్ తో తీసిన రెండో సినిమా ‘శక్తి’ సైతం యావరేజ్ గా మిగిలింది.

2013లో వెంకటేష్ తో తీసిన ‘షాడో’ డిజాస్టర్ అయ్యింది.

తాజాగా(2023) చిరంజీవితో తీసిన ‘భోళా శంకర్’ ఘోరంగా విఫలం అయ్యింది.

కన్నడలో మెహర్ రమేష్ తీసిన ‘వీర కన్నడిగ‘, ‘అజయ్‘ చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.