ఇరవైతొమ్మిదేళ్ల అందాల తార కీర్తిసురేష్ లైఫ్ స్టైల్ చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంది.
తన మొదటి సినిమాలో బొద్దుగా కనిపించిన కీర్తి లావుగా ఉందంటూ విమర్శలు ఎదుర్కొంది. మహానటి సినిమా వరకు కాస్త బొద్దుగానే కనిపించింది.
మహానటి సినిమా పూర్తయ్యాక ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. 20 కిలోల బరువు తగ్గి మెరుపు తీగలా మారింది.
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంది కీర్తి. ఇల్లయినా, జిమ్ అయినా ఎక్కడో దగ్గరా వ్యాయామాలు చేయకుండా రోజు గడవదు ఆమెకు.
ఆమె బరువు తగ్గిన జర్నీలో యోగాది కూడా ముఖ్యపాత్రే. కష్టమైన యోగా భంగిమలు సైతం సులువుగా చేసేస్తుంది కీర్తి. ఈమె శరీరం బరువు తగ్గి అందమైన ఆకృతికి రావడానికి యోగా ఎంతో సహకరించిందని చెప్పింది కీర్తి.
‘మిస్ ఇండియా’ కోసం బరువు తగ్గిన ఈ అమ్మడు కార్డియో ఎక్సర్‌సైజులు రోజూ చేసేది. వాటి వల్లే త్వరగా బరువు తగ్గానని చెబుతోంది కీర్తి సురేష్.
ఇంట్లోనే ట్రెడ్ మిల్ మీద నడవడం, సైకిల్ తొక్కడం, స్పిన్నింగ్ వంటివి ఆమె వ్యాయామాలలో భాగం.
బరువు తగ్గే క్రమంలో పూర్తిగా ఇంటి ఆహారానికే పరిమితమైంది. నాన్ వెజ్ ను వదిలి శాకాహారిగా మారింది. 20 కిలోల బరువు తగ్గడం వెనుక తన ఆహారపు అలవాట్లు కూడా పెద్ద పాత్రే పోషించాయి.
రోజువారీ ఆహారంలో పాలు, నట్స్, రోటీ, కూరగయాలు, తక్కువ పరిమాణంలో అన్నం తినేది. వాటిని న్యూట్రిషనిస్టు చెప్పిన విధంగా తక్కువ పరిమాణంలో తినేది.
రాత్రి పూట తేలికపాటి ఆహారంతో పొట్ట నింపుకునేది. స్మూతీలు, పండ్ల రసాలు, సూప్ లు వంటి వాటికి ప్రాధాన్యతనిచ్చింది.