కన్నడపరిశ్రమంలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. ఈ వార్త కన్నడ పరిశ్రమను శోకసంద్రంలో ముంచింది. ఆయన జిమ్ చేస్తూ గుండె పోటుకు గురైనట్టు తెలిసింది.

సినిమా కుటుంబంలోనే జన్మించిన పునీత్ కు చిన్నప్పట్నించి సినిమాలే లోకం. ఆయన తండ్రి అలనాటి కన్నడ హీరో రాజ్ కుమార్.

ఏడాది వయసులోనే తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. 1976లో ‘ప్రేమద కనికే’ అనే చిత్రంలో కనిపించిన చిన్నబాబు పునీతే.

2002లో ‘అప్పు’అనే సినిమాతో కన్నడలో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తరువాత ఇప్పటివరకు దాదాపు 29 సినిమాలలో నటించారు.

ఆయన చేసిన సినిమాలు చాలా వరకు హిట్ కొట్టడంతో అతి తక్కువ సమయంలోనే కన్నడ పవర్ స్టార్ గా పేరుతెచ్చుకున్నారు.

ఆయన సేవాకార్యాక్రమాల్లో కూడా చురుకుగా ఉంటారు. అవయవదానానికి మద్దతు తెలపడమే కాదు, తన కళ్లను కూడా దానం చేసేందుకు ముందే ఒప్పుకున్నారు.