‘టాయిలెట్’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్.
తన తొలి చిత్రం ‘దమ్ లగాగే హైసా’తోనే తాను ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తానని నిరూపించింది భూమి.
2015లో విడుదలైన ‘దమ్ లగాగే హైసా’ సినిమా కోసం ఆమె ఏకంగా 30 కిలోల వరకు బరువు పెరిగింది. ఆ తర్వాత సన్న బడేందుకు ఎంతో కష్టపడింది.
భూమి తన బరువును తగ్గించుకుని సాధారణ రూపానికి వచ్చేందుకు సుమారు రెండేళ్లు కష్టపడింది.
ఆమె కష్టానికి ఫలితంగా 2017లో ‘టాయిలెట్’ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన ఛాన్స్ కొట్టేసింది.
చదువుకున్న అమ్మాయి టాయిలెట్ సదుపాయం కూడా లేని ఇంటికి కోడలిగా వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది? ఆమె వల్ల ఆ గ్రామంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఈ చిత్రం కథాంశం.
ఈ చిత్రం వల్ల అక్షయ్ కుమార్‌తోపాటు భూమికి కూడా మంచి మార్కులు పడ్డాయి. అప్పటి నుంచి భూమి.. తనదైన శైలిలో వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటోంది.
ఇటీవల భూమి గ్లామర్ డోసు కూడా పెంచేసి.. ఎలాంటి పాత్రలకైనా సై అంటోంది.
ప్రస్తుతం భూమి నటిస్తున్న ‘బదాయి దో’, ‘మిస్టర్ లెలే’, ‘రక్షా బంధన్’, ‘భీద్’, ‘భాక్షక్’ చిత్రాల్లో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇంకా రెండు చిత్రాల షూటింగ్ పూర్తికావలసి ఉంది.