భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు.

డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచాడు.

ఈ ఘనత అందుకున్న భారత తొలి అథ్లెట్‌ అతడే.

గురువారం ఫైనల్లో జావెలిన్‌ను 88.44 మీటర్లు విసిరాడు.

దాంతో నీరజ్‌ అగ్రస్థానంలో నిలిచాడు.

తొలి ప్రయత్నంలో ఫాల్ట్‌ చేసినా..

రెండో ప్రయత్నంలో 88.44 మీ. త్రోతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

జాకబ్‌ వాద్లెచ్‌ (86.94మీ.) రెండో స్థానంలో నిలిచాడు.

వెబర్‌ జూలియన్‌ (83.73) మూడో స్థానం పొందాడు.

నీరజ్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో రజతం గెలిచిన సంగతి తెలిసిందే.