డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి తప్పకుండా తక్కువ జీఐ కలిగిన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

పాలకూర, బచ్చలి కూర, బ్రోకొలి వంటి ఆకుకూరలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.

పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, రాజ్మా, పచ్చిశనగలు వంటి వాటి జీఐ తక్కువ. ఫైబర్, ప్రొటీన్ ఎక్కువ కనుక షుగర్ పేషెంట్స్ కి మంచిది.

అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్లు, ప్రొటీన్, ఫైబర్ పుష్కలం.

బాదాములు, అక్రూట్ వంటి డ్రైఫ్రూట్స్ లో ఫైబర్, ప్రొటీన్, ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు ఎక్కువ.

తెల్లని పాలీష్డ్ బియ్యం కాకుండా బ్రౌన్ రైస్ అన్నం తింటే అందులో ఫైబర్ వల్ల జీఐ తక్కువవుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది.

ఈ రకమైన ఫైబర్ గ్లూకోజ్ శోషణ ను కాస్త నెమ్మదింప చేస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు చెయ్యబడతాయి.

కాకరలో ఉండే చురుకైన సమ్మేళనాలు డయాబెటిస్ అదుపులో పెట్టడంలో మంచి పాత్ర పోషిస్తాయి.

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాదు హైపోగ్లైసిమిక్ లక్షణాలు ఉండడం వల్ల షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

రాత్రంతా నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడుపున నీళ్లతో పాటు తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్లకు చాలా మంచి గుణం కనిపిస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels