డయాబెటిస్ ఉంటే మతిమరుపు



డయాబెటిస్... ప్రపంచంలో ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.



రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండకపోవడమే డయాబెటిస్ వ్యాధి లక్షణం.



డయాబెటిస్ అదుపులో ఉండకపోతే మెదడు పనితీరు మారిపోతుంది. జ్ఞాపకశక్తి క్షీణించి అల్జీమర్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది.



డయాబెటిస్ వల్ల ఇంకా తక్కువ వయసులోనే అల్జీమర్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది.



డయాబెటిస్ అదుపులో ఉండకపోతే 50 ఏళ్లకే ఈ వ్యాధి దాడి చేయవచ్చు.



డయాబెటిస్ ఉన్న వారికే కాదు, ప్రీడయాబెటిస్ ఉన్న వారికి కూడా మెదడు పనితీరులో మార్పులు వస్తున్నాయి.



మధుమేహం లేని వారితో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవారికి మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.



ఎక్కువ కాలం పాటు డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిలో మతిమరుపుతోపాటు డిప్రెషన్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.