కరివేపాకే కదా అని తీసిపడేయద్దు



కర్రీలో కరివేపాకును తేలిగ్గా తీసిపడేస్తారు. నిజానికి కచ్చితంగా కరివేపాకును తినాలి.



కరివేపాకు ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుంది.



కరివేపాకును తినడం వల్ల రక్తంలో కొవ్వు స్థాయిలు తగ్గిపోతాయి. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.



మహిళలు నెలసరి సమస్యలు రాకుండా ఉండాలంటే కరివేపాకులతో చేసిన వంటకాలను ఎక్కువగా తినాలి.



దీనిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఎక్కువ. కాబట్టి డయాబెటిస్ రోగులు వీటిని కచ్చితంగా తినాలి.



దీనిలో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కరివేపాకును తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.



అధిక బరువుతో బాధపడేవారు కరివేపాకులను తరచూ తింటూ ఉండాలి.



గుండె ఆరోగ్యానికి కరివేపాకులు ఎంతో మేలు చేస్తాయి.