ధనుష్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తీసిన సినిమా 'సార్' (తమిళంలో 'వాతి'). ఈ రోజు థియేటర్లలో విడుదలైంది.

కథ : బాలు (ధనుష్) ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్. సిరిపురంలో ప్రభుత్వ కాలేజీలో పాఠాలు చెప్పడానికి వెళతాడు. 

బాలు కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలంతా ఫస్ట్ క్లాసులో పాసవుతారు. దాంతో ప్రైవేట్ కాలేజీలకు ఇబ్బందిగా మారుతుంది.

బాలుకు ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ ప్రెసిడెంట్ త్రిపాఠి (సముద్రఖని) నుంచి ఎటువంటి ఇబ్బంది వచ్చింది?

తనకు ఎదురైన అడ్డంకులు, ప్రాణహాని తట్టుకుని ప్రభుత్వ కాలేజీలో పిల్లలకు చదువు చెప్పడానికి బాలు ఏం చేశాడు? అనేది సినిమా. 

ఎలా ఉంది? : 'సార్' స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్టులు ఏమీ లేకుండా కమర్షియల్ ఫార్మాట్లో వెళ్ళింది.

'సూపర్ 30', '3 ఇడియట్స్' స్ఫూర్తితో వెంకీ అట్లూరి 'సార్' తీశారు. ఎమోషనల్ సీన్లు బాగా రాశారు.

ఎమోషన్ పక్కన పెడితే కథ మీద సరిగా వర్క్ చేయలేదు. దాంతో లవ్ ట్రాక్, కీ సీన్స్ కొన్ని బోర్ కొట్టాయి.

సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. జీవీ ప్రకాష్ కుమార్ పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. 

సంయుక్తా మీనన్ అందంగా ఉంది. కానీ, యాక్టింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ కావాలి.

సాధారణ కథ, సన్నివేశాలను తన నటనతో ధనుష్ నిలబెట్టారు. ఇంటర్వెల్ తర్వాత సీన్స్‌లో ఆయన యాక్టింగ్ సూపర్.

ధనుష్ కోసం, జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కోసం ఎవరైనా వెళ్లాలని అనుకుంటే వెళ్ళండి. లేదంటే లైట్!