బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. 2015లో ‘దమ్ లగా కే హైసా’ సినిమాతో భూమి పెడ్నేకర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 2017లో ‘టాయిలెట్: ఏక్ ప్రేమ కథ’ తనకు మంచి పేరు తీసుకువచ్చింది. గతేడాది మూడు సినిమాలతో పలకరించింది. వీటిలో ‘బదాయ్ దో’, ‘రక్షాబంధన్’ థియేటర్లలో విడుదల అయ్యాయి. ‘గోవిందా నామ్ మేరా’ ఓటీటీలో సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం తన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ సంవత్సరమే విడుదల కానున్నాయి. రాజ్‌కుమార్ రావుతో ‘భీడ్’ సినిమా మార్చిలో విడుదల కానుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా ‘అఫ్వా’ అనే సినిమాలో కూడా నటిస్తుంది.