అందమైన, మచ్చలేని, నున్నని చర్మం కావాలని అందరికీ ఆశగా ఉంటుంది. దాని కోసం నిపుణులు సూచించిన ఈ సూచనలు పాటిస్తే సరి.

ఒమెగా3 కలిగిన బాదాములు, అక్రూట్ వంటివి తీసుకుంటే జుట్టు, చర్మం మెరుపులీనుతాయి.

ఆహారంలో ఉప్పు తగ్గించి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

లైకోపిన్ ఎక్కువగా ఉండే టమాటల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువ.

ఆకుపచ్చని కాయగూరలు, ఆకుకూరలు తీసుకోవడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది.

వేపుళ్లు, బేక్ చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవాలి.

ఎక్కువ ప్రొటీన్, ఫైబర్ కలిగిన పప్పులు, చిక్కుళ్లు, సోయా, టోఫూ వంటి ఆహారం తీసుకోవాలి.

జీర్ణశక్తి పెంచే ప్రొబయోటిక్ లక్షణాలు కలిగిన నిమ్మరసం, వెనిగర్ ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels