ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ రూట్‌లో తొలి ర్యాపిడ్ ట్రైన్స్ సర్వీస్‌లు మొదలు కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 20న ఈ ర్యాపిడ్ ట్రైన్స్‌ని ప్రారంభించనున్నారు. భారత్‌లో అందుబాటులోకి రానున్న తొలి రీజియనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఇదే. ఢిల్లీ నుంచి ఘజియాబాద్ మీదుగా మీరట్‌కి 82.15 కిలోమీటర్ల మేర ఈ ట్రైన్స్ ప్రయాణిస్తాయి. అక్టోబర్ 21 నుంచి ఈ సర్వీస్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఈ సర్వీస్‌లు నడవనున్నాయి. ఈ ట్రైన్‌లో ప్రత్యేకంగా డిలక్స్ కార్ ఉంటుంది. సీట్‌లు చాలా విశాలంగా ఉంటాయి. వైఫై కనెక్టివిటీతో పాటు ల్యాప్‌టాప్స్, మొబైల్స్‌కి ఛార్జింగ్ పెట్టుకునేందుకు పాయింట్స్ ఇచ్చారు.