సూర్యరశ్మి, ధూమపానం, డీహైడ్రేషన్ హైపర్ పిగ్మేంటేషన్ కు కారణమైతే.. విటమిన్ లోపంతో పెదాలు నల్లగా మారుతాయి. ఐరన్ లోపిస్తే పెదవులు నల్లగా మారుతాయి. కొన్నిసార్లు నీలి రంగులోకి మారుతాయి. విటమిన్ 12 లోపంతో కూడా పెదవులు నల్లగా మారుతాయి. కొన్నిసార్లు విటమిన్ సి లోపిస్తే కూడా చర్మంతోపాటు పెదవులు నల్లగా మారుతాయి. పెదాలను తేమగా ఉంచేందుకు లిప్ బామ్, పెట్రోలియం జెల్లిని ఉపయోగించవచ్చు. మీ పెదాలను ఎక్స్ ఫోలియేట్ చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోయి లిప్స్ పింక్ గా మారుతాయి. లిప్ బామ్ లేదా ఎస్పీఎఫ్ ఉన్న లిప్ స్టిక్ ను ఉపయోగిస్తే పెదాలు నల్లగా కనిపించవు. పెదాలపై నిమ్మరసం రాస్తే పెదాల రంగు నెమ్మదిగా మారుతుంది. నిమ్మకాయను కట్ చేసి పెదాలపై అప్లయ్ చేయండి. కొన్ని నిమిషాల తర్వాత నీటితో కడగితే ఫలితం ఉంటుంది.