దీప్తి సునయన గురించి మీకు తెలిసిందే. దీప్తికి నటన, డ్యాన్స్‌లో మంచి టాలెంట్ ఉంది. కానీ, సినిమాల్లోకి దీప్తి సెట్ కాదనే అభిప్రాయం ఉంది. అందుకే ఆమె హీరోయిన్ ఫ్రెండ్స్, సిస్టర్ క్యారెక్టర్లకే పరిమితమైంది. యూట్యూబ్ వీడియోలు చూస్తే ఆమె నటనకు ఫిదా అవుతారు. దీప్తి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఎవరైనా సరే పడిపోవల్సిందే. ప్రియుడు షన్ముఖ్‌తో బ్రేకప్ దీప్తిని బాగా బాధించింది. ఆ బాధను మరిచిపోవడానికి ఆమె ఫ్రెండ్స్‌తో ఎక్కువగా గడుపుతోంది. తాజాగా ఆమె తన మనసులో మాటను ఇన్‌స్టాలో క్యాప్షన్‌గా పెట్టింది. జీవితంలోని గాయాలను నయం చేసే శక్తి ప్రకృతికే ఉందని పేర్కొంది. దీన్ని బట్టి.. బ్రేకప్ వల్ల దీప్తి మనసు ఎంత గాయపడిందో అర్థమవుతుంది. Images & Videos: Deepthi Sunaina/Instagram