ఈ వారం మరికొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. విక్రాంత్ రోణ: కిచ్చా సుదీప్ నటించిన ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది. ది లెజెండ్: శరవణ స్టోర్స్ అధినేత అరుల్ శరవణన్ నటిస్తున్న ఈ సినిమా జూలై 28న విడుదలకు కానుంది. రామారావు ఆన్ డ్యూటీ.. జూన్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏక్ విలన్ రిటర్న్స్: అర్జున్ కపూర్, జాన్ అబ్రహాం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 29న విడుదల కానుంది. గుడ్ లక్ జెర్రీ: జాన్వీకపూర్ కపూర్ నటించిన ఈ సినిమా జూలై 29 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. రాకెట్రీ - ది నంబి ఎఫెక్ట్.. సినిమా జూలై 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హాలీవుడ్ సినిమా 'ది బ్యాట్ మ్యాన్' జూలై 27 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. షికారు: ఈ సినిమాను జూలై 29 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. పేపర్ రాకెట్: ఈ సినిమాను జూలై 29 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన '777 చార్లీ' సినిమా జూలై 29 నుంచి వూట్ యాప్ లో టెలికాస్ట్ కానుంది. 19 (1) (ఎ) మలయాళ సినిమా జూలై 29 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.