నటి, నిర్మాత మంచు లక్ష్మీ కన్నీంటి పర్యంతమయ్యారు. కన్నీళ్లు తుడుచుకుంటూ ‘ఇంత కష్టంగా ఉంటుందనుకోలేదు’ అని ఏడ్చేశారు. లక్ష్మీ తన భాధను ఇన్ స్టా అభిమానులతో పంచుకున్నారు. ఇంతకీ ఆమెకు అంత కష్టం ఏమి వచ్చిందనేగా మీ సందేహం? ఇదిగో ఏం చెప్పిందో చూడండి. చాలా రోజుల తర్వాత తన కూతురు స్కూల్‌కు వెళ్తోందనే బాధతో ఏడ్చేసింది. కరోనా వల్ల రెండేళ్లుగా లక్ష్మి కూతురు విద్య నిర్వాణ ఆన్‌లైన్లోనే క్లాసెస్ అటెండ్ అవుతోంది. సుమారు రెండేళ్లుగా ఇంట్లోనే ఉండటం వల్ల విద్య బాగా అలవాటైపోయిందని లక్ష్మి తెలిపింది. అందుకే, విద్యను స్కూలుకు పంపిన తర్వాత తనకు చాలా కష్టంగా ఉందంటూ ఏడ్చేసింది. కూతురు గురించి మాట్లాడుతున్నంత సేపు లక్ష్మీ కళ్ల వెంట కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఎంతైనా.. తల్లి ప్రేమ, తల్లి ప్రేమే కదా!! Images and Videos Credit: Manchu Lakshmi/Instagram