బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా భట్ 'ఆర్ఆర్ఆర్'తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో సీత క్యారెక్టర్ లో కనిపించింది అలియా. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'డార్లింగ్స్' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించింది అలియా. దీంతో ఈ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తుంది. తను గర్భవతి అయినప్పటికీ.. మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇస్తోంది. అలానే సోషల్ మీడియాలో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ.. పలు ఫొటోషూట్స్ ను షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలియా భట్ లేటెస్ట్ ఫొటోస్ అలియా భట్ లేటెస్ట్ ఫొటోషూట్