'జవాన్' సాంగ్ కి దీప్తి సునైనా స్టెప్పులు - వీడియో వైరల్! యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది దీప్తి సునైనా. అందం, యాక్టింగ్, డాన్స్ అన్నిట్లోనూ తన టాలెంట్ చూపించి తక్కువ సమయంలో ఫేమస్ అయింది. 'బిగ్ బాస్ సీజన్ 2' లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది. యూట్యూబర్ గా ఉన్న సమయంలోనే షణ్ముక్ జస్వంత్ తో ప్రేమలో పడింది. రీసెంట్ గానే షణ్ముక్ కి బ్రేకప్ చెప్పి ఒంటరిగా ఉంటూ ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించి ఆకట్టుకుంది. 'జవాన్' సాంగ్ కు దీప్తి సునైనా డాన్స్ చేస్తున్న వీడియో నెటిజెన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Deepthi Sunaina/Instagram