చూడటానికి అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించే దీపికది తమిళనాడు. తొలుత న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది దీపిక. ఆ తర్వాత మోడల్‌గా పలు అడ్వర్టైజ్‌మెంట్స్‌లో కనిపించింది. నెమ్మదిగా నటిగా తమిళ టీవీ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇప్పుడు 'బ్రహ్మముడి' సీరియల్ తో అలరిస్తోంది. ఈ నేపథ్యంలో షేర్ చేసిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. 'హల్ గురూ ప్రేమ కోసమోరోయ్ జీవితం..' అంటూ మానస్ తో రీల్ చేసింది. చూడముచ్చటగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. 'బ్రహ్మముడి' సీరియల్‌లోనూ మానస్‌కు జోడీగా, దీటైన నటనతో దీపిక ఆకట్టుకుంటోంది. Image Credits: Deepika Rangaraju/Instagram